మొక్కజొన్న,మినుము పంటలపై ఏఓ అవగాహన..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మొక్కజొన్న మినుము పంటలపై నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి రైతులకు అవగాహన కల్పించారు.బుధవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని శాతనకోట,అల్లూరు గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’అనే కార్యక్రమంలో భాగంగా రైతులు వేసిన మొక్కజొన్న మినుము పంటలను ఏవో పరిశీలించారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తర్వాత మొక్కజొన్న మరియు మినుము పంటలను పరిశీలించి పంటలపై ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై అదేవిధంగా పంటలపై చీడపీడల నుండి ఏ విధంగా పంటలను కాపాడుకోవాలనే వాటి గురించి రైతులకు వివరించారు.ప్రస్తుతం శనగ పంటలో ఎండు తెగులు, మొదలు కుళ్ళు తెగులు మరియు లద్దె పురుగులు ఆశించి నష్టం కలిగి చేస్తున్నట్టు గమనించామని అన్నారు.మొదలు కుళ్ళు మరియు ఎండు తెగులు నివారణకు గాను ఎకరానికి ‘డైతేన్ ఎం -45: 600 గ్రా లేదా బావిష్టిన్:200 గ్రా మరియు ప్లాoటమైసిన్ 100 గ్రా కలిపి పిచికారి చేసుకోవాలన్నారు లద్దె పురుగులు నివారణకు గాను ఎకరానికి క్లోరీ పైరీఫాస్:500 మి.లీ.లేదా అసిఫేట్:300గ్రా లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్:80 గ్రా లేదా క్లోరాత్రా నిలిప్రోలు: 60 మి.లీ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు.