PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ బేడ బుడగ  జంగం కులానికి న్యాయం చేస్తాం

1 min read

జాతీయ కమిషన్ సభ్యులు రామచందర్  హామీ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: న్యూఢిల్లీ లోక నాయక్ భవన్ నందు షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్ కి ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కమిటీ తరఫున తాటికొండ నారాయణ, తూర్పాటి మనోహర్, తాటికొండ కొండన్న, సిరివాటి గిరిధర్ కలిసి, మా జాతి రిజర్వేషన్ సమస్య కేంద్రంలో పెండింగ్లో ఉంటున్నది. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రభుత్వాలు తమ యొక్క నివేదికలను క్షుణ్ణంగా పంపిన, న్యాయానికి నోచుకోవడం లేదని, కనుక తమరు చొరవ తీసుకొని  న్యాయం జరిగే విధంగా చూడాలని కోరగా, వాటికి స్పందించిన జాతీయ కమిషన్ నెంబర్ మీ సమస్యను 20 రోజుల్లో ఎక్కడ మీ సమస్య ఆగి ఉంటుంది, వాటికి ఏ విధంగా పరిష్కరించాలని వాటికి సంబంధించిన  రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వ అధికారుల ద్వారా  కాల్ ఫర్ రికార్డుతో న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగినది.

About Author