హజరత్ షాషా శెక్షావలి స్వామి వార్లను దర్శించుకున్న ఏపీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామంలో వెలసిన హజరత్ షాషా శెక్షావలి స్వామి వార్లను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షేక్ ఖాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ గా నూతనంగా నియమితులైన శుభ సంధర్భంగా ఈ రోజు కర్నూలు జిల్లా ఎల్లార్తి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ హజరత్ షాషా శెక్షావలి స్వామివార్లను దర్శించుకుని స్థానిక మైనారిటీ సహోదరలను మరియు గ్రామ ప్రజలను ఆత్మీయతంగా పలకరించి స్థానిక దర్గా అభివృద్ధి సమస్యల గురించి తెలుసుకుని రానున్న రోజుల్లో దర్గా అభివృద్ధి కోసం నా వంతుగా వక్ఫ్ బోర్డు నిధుల ద్వారా సహాయ సహకారాన్ని అందిస్తానని తెలియజేయడం జరిగింది. వక్ఫ్ డైరెక్టర్ షేక్ ఖాజా ఎల్లార్తి గ్రామానికి వచ్చిన శుభ సంధర్భంగా స్థానిక మైనారిటీ సహోదరులు మరియు గ్రామ ప్రజలు,చుట్టుపక్కల ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు శాల్వా పూల మాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్జున్ షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.