PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ జిల్లా కు ఏలూరు జిల్లా నుండి ఆపన్నహస్తం

1 min read

బాధితులకు ఏలూరు నుండి 50 వేల మందికి ఆహార పంపిణీ

జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన వంటలు

50 వేలు ఫుడ్ ప్యాకెట్ లు సిద్ధం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న ఎన్ .టి. ఆర్.  జిల్లాకు ఏలూరు జిల్లా ఆపన్నహస్తం అందించింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా నుండి పెద్దఎత్తున ఆహార పదార్థాలను సోమవారం ఉదయం జిల్లా యంత్రాంగం విజయవాడకు పంపించారు. సోమవారం ఉదయం నుండే ఆహారాన్ని తయారు చేసి  50 వేల ఫుడ్ పాకెట్స్, లక్ష బిస్కట్ ప్యాకెట్లు, లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ ప్యాకెట్ లు, 30 వేల  బ్రెడ్ ప్యాకెట్లు, 50 వేల కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలను సిద్ధంచేసి, రోడ్డు మార్గాన విజయవాడకు వాహనాల ద్వారా పంపించారు.  ఏలూరులోని గోకుల్ కల్యాణమండపం, ఇతర కేటరింగ్ ల వద్ద యుద్ధ ప్రాతిపదికన ఆహార పదార్థాలను జిల్లా యంత్రాంగం  తయారు చేయించారు. గోకుల్ కల్యాణ మండపంలో ఆహార పదార్థాల తయారీని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్వయంగా పరిశీలించారు.  నాణ్యతతో కూడిన ఆహారం తయారీ, ఆహార తయారీకి ఉపయోగించే కాయగూరలు, బియ్యం, తదితర వస్తువుల నాణ్యతను కలెక్టర్ వెట్రిసెల్వి దగ్గరుండి పరిశీలించారు.  ఆహార తయారీ అనంతం  జిల్లా అధికారులతో కలిసి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార తయారీ నుండి పేకింగ్ వరకు ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా ఉండేందుకు జిల్లా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.  కలెక్టర్ ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఆర్డిఏ పీడీ డా:విజయరాజు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ సత్యనారాయణ,  ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భాను ప్రతాప్, గృహ నిర్మాణ శాఖ పీడీ  ఏ .శ్రీనివాస్, ఏలూరు తహసీల్దార్ శేషగిరి, ఏలూరు నగరపాలక అధికారులు ఆహార పదార్థాలు తయారీని దగ్గరుండి పర్యవేక్షించారు.  పాల ప్యాకెట్లు రవాణాను డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్ పర్యవేక్షించారు. 50 వేల ఫుడ్ ప్యాకెట్లు, లక్ష బిస్కెట్ ప్యాకెట్ లు, 2 లక్షల వాటర్ ప్యాకెట్ లు, 30 వేల బ్రెడ్ బ్యాకెట్ లు, 50 వేలు కొవ్వొత్తులు, అగ్గి పెట్టెలను ప్రత్యేక వాహనాలలో అధికారులు విజయవాడకు పంపించారు.

About Author