అపర చాణక్యుడు కొనిజేటి రోశయ్య
1 min readమాజీ ఎమ్మెల్సీ ..ఎం సుధాకర్ బాబు
పల్లెవెలుగు వెబ్ కర్నలు: అపర చాణక్యుడు కొనిజేటి రోశయ్య ని మాజీ ఎమ్మెల్సీ, మాజీ డిసిసి అధ్యక్షులు యం సుధాకర్ బాబు అభిప్రాయపడ్డారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుధాకర్ బాబు మాట్లాడుతూ రోశయ్య 1933 జూలై 4న జన్మించారని అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వాలలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సునాయాసంగా గట్టెక్కించిన మేధావి రోశయ్యని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు చమత్కారంతో సమాధానాలు చెప్పే వారని, 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించినప్పుడు ఆపధర్మ ముఖ్యమంత్రిగా పని చేశారని, 2019 సంవత్సరం తమిళనాడు గవర్నర్ గా పనిచేశారని అనంతరం 2021 డిసెంబర్ 4న రోశయ్య గారు మరణించారని ఆయన సేవలను కొనియాడారు. ముందుగా పార్టీ కార్యాలయంలో రోశయ్య చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కే వెంకటరెడ్డి, ఐఎన్టియుసి అధ్యక్షులు బి బతుకన్న, ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, షేక్ ఖాజా హుస్సేన్, యస్ ప్రమీల, కె సత్య నారాయణ గుప్త, కురువ నాగశేషు, బి రామాంజనేయులు, ఖాద్రీ పాషా, యజాస్ అహ్మద్, డబ్ల్యూ సత్య రాజు, సాయి కృష్ణ అబ్దుల్ హై, జాన్ సదానందం, పసుపుల ప్రతాపరెడ్డి, షేక్ మాలిక్, జయకుమార్, అక్బర్, ఐ ఎన్ టి యు సి నాయకులు ఆర్ ప్రతాప్, ఆనందం, ఆశీర్వాదం, అశోక్ మొదలగువారు పాల్గొన్నారు.