PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోరందుకున్న ఏపీ ఎన్ జి జి వోస్ మజ్జిగ చలివేంద్రం

1 min read

ప్రయాణికులకు, పాదచారులకు,బాటసారులకు  సంఘ సేవకులుల సర్వీస్ చేస్తున్న ఉద్యోగస్తులు

మజ్జిగ, మంచినీరు మరింత అధిక మొత్తంలో అందిస్తాం

ఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్

అత్యవసరమైతే తప్ప రహదారులు వెంబడి ప్రయాణం చేయడం మంచిది కాదని సూచన..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు 47, 48 డిగ్రీలలో సెగలుస కక్కుతున్న తరుణంలో ప్రయాణికులు, వాహనదారులు, పాదచారులు దాహర్తికి విలవిలాడుతున్నారు. దీన్నే అదునుగా చూసుకుని రహదారులలో దుకాణదారులు మంచినీటి బాటిల్, చెరకు రసం,జ్యూస్, ఐస్ క్రీమ్, చల్లని పానీయాలు సైతం తమకిష్టం వచ్చిన ఖరీదుకి అమ్ముతూ వ్యాపారాలు సాగిస్తున్నారు. సామాన్య ప్రజలు రోజువారి కూలీలు, ఆటో డ్రైవర్లు వాటిని కొని దాహం తీర్చుకునే పరిస్థితుల్లో లేరు. జిల్లా పరిషత్ ఎదురుగా ఏపీ ఎన్జీవోస్ నాయకులు గత వారంలో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ఫైర్ స్టేషన్ నుండి కొత్త బస్టాండ్ కి ప్రధాన రహదారిలో ఉండటంతో వేలాదిమంది ఈ మార్గం నుండి రాకపోకలు సాగిస్తుంటారు. కుక్కేడు మంచినీళ్లు దొరికితే ప్రాణం గట్టెక్కుతుందన్న పరిస్థితుల్లో ఈ దారిన పోయే వారికి దాహార్తిని తీర్చుకునేందుకు నయాగరా జలపాతంలా ఈ మజ్జిగ, మంచినీరు చలివేంద్రం బాగా ఉపయోగపడుతుందని దాహం తీర్చుకుని సేద తీరుతున్న ప్రజలు అంటున్నారు. శనివారం పే అండ్ అకౌంట్స్ వారి ఆధ్వర్యంలో ఏపీ ఎన్ జి జి వోస్ చలివేంద్రం వద్ద బస్సులలో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణీలకు ఒక నిమిషం పాటు బస్సులను ఆపి ప్రయాణికులకు మంచి క్వాలిటీ ఉన్న మజ్జిగ, పరిశుభ్రమైన మంచినీరు అందిస్తూ ఉద్యోగస్తులు సంఘ సేవకుల సర్వీస్ చేస్తున్నారు. పలువురు ప్రయాణికులు, పాదచారులు, మహిళలు ఇంత మంచి సేవలందిస్తున్న వారిని అభినందిస్తున్నారు. వేసవి తీవ్రతలు తగ్గేంతవరకు మజ్జిగ, మంచినీరు అధిక మొత్తంలో అందించి మరిన్ని రోజుల కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసరించి ప్రయాణికులకు, వాహనదారులకు అత్యవసరమైతేనే తప్ప రహదారుల వెంబడి ప్రయాణం చేయకూడదని, ఎండ తీవ్రత తగ్గిన తరువాత తమ పనులు కొనసాగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి నేరుసు రామారావు, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ హరినాథ్, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author