ఏపీఎన్జీవోస్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం
1 min readకుటుంబ సభ్యులతో ఉల్లాసంగా వన సమారాధన కార్యక్రమం
కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు
పెండింగ్ లో ఉన్న 21,000/-కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు మండలం శానిగూడెం గ్రామం కూరంశెట్టి ధనుంజయ వ్యవసాయ క్షేత్రంలోఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమా వేశం లో జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్, జేఏసీ నాయకులు ఆర్ ఎస్ హరనాథ్ మరియు అన్ని తాలూకా అధ్యక్ష , కార్యదర్శులు.జిల్లా కార్యవర్గ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో పాల్గొని వన సమారాధన సంఘ సభ్యులతో ఉల్లాసంగా జరిపారు. సమవేశం లో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా లో ఉన్న అన్ని తాలూకాలలో ఉద్యోగులు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సభ్యత్వం పూర్తి చేయాలని. గత ప్రభుత్వం ఉద్యోగులను అన్ని విధాలా మోసం చేసి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకుండా,పెండింగ్ లో పెట్టి సుమారు 21,000 కోట్ల రూపాయలను ఉద్యోగ, ఉపాధ్యాయలకు, పెన్షనర్లకు బాకి పడిందని. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పై భారం మోపిందని నూతనం గా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పై ఎన్నో ఆశలు ఉద్యోగ వర్గం పెట్టుకుందని.వెంటనే మధ్యంతర భృతి.విడుదల చేయాలని,12 వ పి.ఆర్.సి కమిషనర్ ను నియమించి త్వరితగిన పీఆర్సీ ఇవ్వాలని డి ఎ బకాయిలు. జీపీఎఫ్.ఏపీజీఎల్ఐ లోన్ అమౌంట్స్.మెడికల్ బిల్స్ ను. సరెండర్ లీవ్స్ ఎన్క్యాష్మెంట్ ఈ ఆర్థిక సంవత్సరం లోపు క్లియర్ చేయాలనీ డిమాండ్ చేశారు. కార్యదర్శి రామారావు మాట్లాడుతూ మెడికల్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు మరింత పని భారం పెరిగింది వుందని. అలాగే అనేక యాప్స్ వుండటం వలన పని భారం తగ్గించాలని కోరారు. అనంతరం జిల్లా లో ఖాళీ లు గా వున్న కార్యవర్గ సభ్యులను కో ఆప్షన్ ద్వారా ఎన్నుకొన్నారు.కో-ఆప్షన్ని జరపడానికి పరిశీలకులు గా రాష్ట్ర కార్యదర్సి అడపా రంజిత్ కుమార్ నాయుడు పర్యవేక్షణలో జరిగాయి. ఎన్నికైన వారిలో నోరి శ్రీనివాస్,జిల్లా సహాద్యక్షుడు జలవనరుల శాఖ. కోశాధికారి గా పమిడిముక్కల శ్రీనివాస్. స్టేట్ టాక్స్ డిపార్టుమెంటు. ఉపాధ్యక్షుడుగా కొడవటి. సురేష్.మున్సిపల్ కార్పొరేషన్. సంయుక్త కార్యదర్శి గా మేరుగ ఫణి కుమార్.పశు సంవర్థక శాఖ. ఉపాధ్యక్షురాలు (విమెన్) వి. మల్లిక స్త్రీ శిశు సంక్షేమ శాఖ. జి. నాగమణి.సంయుక్త కార్యదర్శి గ్రామ,వార్డు సచివాలయ డిపార్టుమెంటు నుంచి ఎన్నికయ్యారు. అనంతరం ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తో ఆటల, పాటల పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల చేతుల మీదుగా బహుమతులని అందజేశారు.