PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోడల్ పాఠశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న మోడల్ పాఠశాలలో 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలనిపాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష మంగళవారం తెలిపారు. ఈనెల 14వ తేదీ లోపు విద్యార్థి ఆధార్ రేషన్ కార్డు ఫోటో తీసుకొని మోడల్ పాఠశాలలోనే దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు మోడల్ పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

About Author