నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నియామకం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ & నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడిగా దివాకర్ బాబు ని నియమిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దివాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నర్సుల మరియు నర్సింగ్ స్టూడెంట్స్ సమస్యల మీద రాజీ లేని పోరాటాలకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అనేకమంది నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అనేక మంది ప్రాణాలు కాపాడుతూ సమాజానికి ఆదర్శవంతమైన జీవితం జీవిస్తున్న నర్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నర్సులకు ప్రత్యేక స్థానం ఇవ్వాలనివారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ,ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల పని ఒత్తిడి నుండి మినహాయింపు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులను అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.