PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రజక కార్పొరేషన్ చైర్మన్ గా సావిత్రి నియామకం

1 min read

హర్షం వ్యక్తం చేసిన రజక సంఘం నాయకులు…

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  హొళగుంద మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వము  శనివారం నామినేటెడ్ పదవులను విడుదల చేసింది అందులో బిజెపి కోటాలో ఆదోని కి చెందిన అడ్వకేట్ సావిత్రికి ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, గా పదవి ఇచ్చినందుకు మండల కేంద్రంలో రజక సంఘం నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం  చేశారు,  ఆమె ఎన్నికైనందుకు బహుజన టైమ్స్ ప్రతినిధి తో  మాట్లాడుతూ,ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా ఉంటూ  బిజెపి పార్టీ యందు అంచలంచలుగా ఎదుగుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి జిల్లా సెక్రటరీగా ఉమ్మడి ఎలక్షన్ సెక్రటరీగా దాంతోపాటు రాష్ట్ర కో కన్వీనర్ గా పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు రాయలసీమ జోనల్ ఇన్చార్జిగా ఉంటూ రాష్ట్ర సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు ఆమె సేవలను గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం బిజెపి కోటా యందు పదవి ఇచ్చినట్లు తెలిపారు ఈరోజు ఎన్నికైనందుకు మండలంలోని రజక సంఘం నాయకులు  ,ఉలిగన్న ఎల్ఐసి లక్ష్మన్న కరెంట్ లక్ష్మన్న సిఐటియు నాగరాజు సి మహేష్ ప్రకాష్ గజ్జహల్లి రామలింగ శేఖర్ హుసేని శ్రీ ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author