రూ.7.87 కోట్లతో కాలుష్య నియంత్రణకు వీలుగా అభివృద్ధి పనులకు ఆమోదం
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కింద కర్నూలు నగరంలో రూ.7.87 కోట్లతో కాలుష్య నియంత్రణకు వీలుగా అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాలుష్య నియంత్రణ లో భాగంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కు సంబంధించి జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు..ఈ సందర్భంగా2024-25 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణలో భాగంగా కర్నూలు నగరంలో గాలి నాణ్యత పెంచేందుకు వీలుగా పలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఇందులో భాగంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద గ్రీనరీ డెవలప్మెంట్, సర్కిల్స్ వద్ద వాటర్ ఫౌంటైన్, ఎండ్ టు ఎండ్ రోడ్ల చదును, జంక్షన్ అభివృద్ధి పనులను చేసి దుమ్ము,ధూళిని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. కిడ్స్ వరల్డ్ నుంచి రాజ్ విహార్ బస్ స్టాప్ దాకా ఉన్న రోడ్లకు ఇరువైపులా డస్ట్ లేకుండా మొత్తం తారు రోడ్డు వేయాలని (end to end paving of roads) కలెక్టర్ ఆదేశించారు..సి. క్యాంపు నుంచి విజ్ఞాన్ మందిర్ వరకు, విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి రైతు బజార్ వరకు, విజ్ఞాన్ మందిర్ నుంచి బి క్యాంప్ ఆటో స్టాండ్ వరకు కూడా ఇదే విధంగా రోడ్లకు ఇరువైపులా డస్ట్ లేకుండా మొత్తం తారు రోడ్డు వేయాలని కలెక్టర్ ఆదేశించారు.అదేవిధంగా ఉల్చాల జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు ప్లాంటేషన్ చేపట్టి,పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. కిసాన్ నగర్ పార్క్ లో పచ్చదనం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.సర్కిల్లు, డివైడర్ ల మధ్య లో ఉన్న మొక్కలు ఎండిపోకుండా పచ్చదనం పెంచేలా నిర్వహణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎయిర్ క్వాలిటీ వివరాలను తెలియ చేసే డిస్ప్లే బోర్డ్ లను నగరంలోని 3 ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. కాలుష్య నియంత్రణకు వీలుగా పచ్చదనం అభివృద్ధి చేసేలా ప్రజలకు కూడా అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ పి.వెంకట కిషోర్ రెడ్డి, డిటీసీ శాంత కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.