PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిసరాలను శుభ్రం చేసుకోవడమే ఏపీఎస్ ఆర్టీసీ లక్ష్యం

1 min read

పల్లెవెలుగు  వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపోలో ఉద్యోగులంతా స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా కలిసి ఎమ్మిగనూరు శాసనసభ్యులు, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బి . వి.జయ నాగేశ్వర్ రెడ్డి స్వచ్ఛత లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించిన చోట శ్రమదానం చేసి ఎర్రమట్టిని చెట్లు నాటిన చోట డిపో మేనేజర్ బి అమర్నాథ్ తో పాటు అసిస్టెంట్ మేనేజర్ జి . వి.నాగరాజు ఎల్ .హెచ్. గంగప్ప మరియు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ బి అమర్నాథ్ సారథ్యం వహించి స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతను అనుసరించి మేము స్వచ్ఛత కొరకు కట్టుబడి ఉంటామని, అందుకొరకు మా సమయాన్ని అంకితబ ద్దం చేస్తామని, సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి రెండు గంటలు చొప్పున పరిశుభ్రత కొరకు స్వచ్ఛందంగా పాటుపడతామని, బహిరంగ ప్రదేశాల్లో చత్తవెయ్యమని, ఇతరులతో వెయ్యనీయమని, పరిశుభ్రత అన్నది దైవంతో సమానమని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటకు తమ వంతు కృషి చేస్తామని ఉద్యోగులతో ఉదయం 6 గంటలకు ప్రతిజ్ఞ చేయించి శ్రమదానం చేశారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా విభాగం ఆయన ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపోలో  “స్వచ్ఛతే సేవ పక్షోత్సవాలు” సెప్టెంబర్ 17 వ తారీకు నుండి అక్టోబర్ 1వ తారీకు వరకు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో అందరూ ఉద్యోగులు పాల్గొని తమ ఇంటి పక్కన మరియు ముందు ఎటువంటి చెత్త వేయకుండా తమ వంతు కృషిగా చేయాలని ఈ సందర్భంగా డిపో మేనేజర్ కోరారు. స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత పరిసరాల స్వచ్ఛత శుభ్రత మనందరి బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ఎర్రమట్టిని యూనియన్ తరపున తెప్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు బస్టాండ్ మేనేజర్ ఎల్లప్ప, ఏ డి సి ఎన్. పి. ఎం. సాహెబ్ , గంగప్ప, చాంద్ భాషా, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఎం రఫీక్ మరియుఉద్యోగులు పాల్గొన్నారు.

About Author