మార్లమడికి గ్రామానికి రేపటి నుండి ఏపీఎస్ఆర్టీసి బస్సు రాక
1 min readఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ.నారా లోకేష్ ఆదేశాల మేరకు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : స్పందించిన ఆదోని డిపో ఏపీఎస్ఆర్టీసి అధికారులు డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ సార్ అసిస్టెంట్ మేనేజర్ రాఘవేంద్ర _ఎమ్మార్పిఎస్ సంఘం నాయకులు ఫిర్యాదు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మార్లమడికి గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రుల హెచ్ఎంటీవీ ఛానల్ సంస్థ దినపత్రికల సంస్థల సహకారంతో.రేపు ఉదయం 07.00 గంటల 45 నిమిషాలకు మార్లమడికి గ్రామం నుండి హోళగుంద కు బస్సు బయలుదేరుతుంది. సాయంత్రం హోళగుంద నుండి 04.00 గంటల 15 నిమిషాలు మార్లమడికి గ్రామానికి బస్సు బయలుదేరుతుంది.ఈ సందర్భంగా ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ అసిస్టెంట్ మేనేజర్ రాఘవేంద్ర సార్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి శ్రీ.నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ రోజు మార్లమడికి గ్రామాన్ని సందర్శించి రూట్ మ్యాప్ పరిశీలించి విద్యార్థులకు అనుకూలంగా ఏపీఎస్ఆర్టీసి బస్సును నడపడం జరుగుతుంది.అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి బస్సు పాసు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు వారు తెలియజేశారు. సాధారణ ప్రజలు ప్రయాణికులు కూడా టికెట్ తీసుకుని ఈ బస్సులో ప్రయాణం చేసే వెసులుబాటు ఉంటుందని వారు మార్లమడికి గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మార్లమడికి సర్పంచ్ రమేష్ న్యాయం దినపత్రిక ఎడిటర్ కన్నారావు. ఎమ్మార్పిఎస్ పత్తికొండ డివిజన్ ఉపాధ్యక్షుడు పంచగుండు వెంకటేష్ మార్లమడికి గ్రామస్తుడు వై.రంగప్ప ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మార్లమడికి గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు ఎమ్మార్పిఎస్ నాయకులు మంగయ్య శేఖర్ మల్లికార్జున వీరేష్ గర్జప్ప భాస్కర్ మల్లికా విద్యార్థుల తల్లిదండ్రులు ఏమయ్యా ఉలిగేష్ వీరేష్ శేఖర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.