కర్నూలు జిల్లా విద్యాధికారి కి శుభాకాంక్షలు తెలిపిన ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా విద్యాధికారి గా బాధ్యత లు చేపట్టిన శ్రీ ఎస్ శామ్యూల్ పాల్ ని కర్నూలు జిల్లా కు చెందిన ఆప్టా నాయకులు కలసి తమ హృదయ పూర్వక శభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్బంగా ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పై పూర్తి అవగాహన కలిగిన, జిల్లా విద్యా శాఖ పై పట్టు కలిగిన ఒక మంచి అధికారి రావడం కర్నూలు జిల్లా విద్యా శాఖ అదృష్టం అని అన్నారు. జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతు సంఘం పరంగా జిల్లా విద్యాధికారి కి పూర్తి సహకారం అందిస్తాం అని అన్నారు. జిల్లా ప్రథాన కార్యదర్శి సేవాలాల్ నాయక్ మాట్లాడుతూ చిరు నవ్వు చెరగని అధికారి, కష్టపడే అధికారి అయిన శామ్యూల్ పాల్ నాయకత్వం లో జిల్లా విద్యా శాఖ అభివృద్ది దిశలో ప్రయాణం చేస్తుంది అన్నారు. జిల్లా విద్యాధికారి సంఘం నాయకులకు కృతజ్ఞతలు చెపుతూ మీకూ ఎల్లవేళల అందుబాటు లో వుండటం జరగుతుంది, టీచర్ల సమస్యలు తీర్చటానికి తన పూర్తి సహకారం వుంటుంది అని అందరం కలసి జిల్లా విద్యా శాఖ ను అభివృద్ది లో నడిపి , కర్నూలు జిల్లా ను విద్యా రంగ లో రాష్ట్రం లో ప్రథమ స్థానం లో నిలబెడుదాం అన్నారు.ఈ కార్యక్రమము లో నంద్యాల జిల్లా ఆప్టా ప్రథాన కార్యదర్శి మహమ్మద్ రఫీ మరియు ఆప్టా కర్నూలు జిల్లా సలహాదారుడు జగదీష్ పాల్గొన్నారు.