పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సమావేశం లో పాల్గొన్న ఆప్తా
1 min readపల్లెవెలుగు వెబ్ మంగళగిరి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపాఠశాల విద్యా సంచాలకులు విజయరామరాజు ఆహ్వానం మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ప్రధాన కార్యాలయం మంగళగిరి నందు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సమావేశం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగినది ఇందులో ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ జి ఎస్ గణపతి రావు ప్రధాన కార్యదర్శి కే ప్రకాష్ రావు పాల్గొన్నారు , జీవో 117 వెంటనే రద్దు చేయాలని ఈ జీవో ద్వారా గత ప్రభుత్వం సమీప హైస్కూల్లో కలిపినటువంటి 3,4,5, తరగతులను తిరిగి వాటి పాత పాఠశాలల్లో పునరుద్ధరించాలని అలాగే ప్రతి ప్రాథమిక పాఠశాలకు అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేయాలని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 6 7 8 తరగతి లకు విషయ బోధన స్కూల్ అసిస్టెంట్లతో చెప్పించాలని వందమంది విద్యార్థులు కల ప్రాథమిక పాఠశాలకు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులను నియమించాలని, 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలకు రెండు ఎస్జీటీ పోస్టులను కేటాయించాలని 20 కంటే తక్కువ ఉన్న పాఠశాలలకు ఒక ఎస్సీటీ ఒక ఎంపీఎస్ ఉపాధ్యాయుని కేటాయించాలని ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలో ఉండాలని వారు సూచించారు, ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలలో సెక్షన్కు 30 మంది విద్యార్థులు ఉండేలా చర్య తీసుకోవాలని 9 10 తరగతిలో సెక్షన్కు 40 మంది విద్యార్థులు ఉండేలాగా చర్య తీసుకోవాలని అంతకంటే విద్యార్థులు ఎక్కువ ఉన్నప్పుడు రెండవ సెక్షన్ ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాల ల ఉపాధ్యాయులకు యూప్లభారం తగ్గించాలని ఉపాధ్యాయుల పూర్తి సమయాన్ని విద్యార్థుల కు విద్యా బోధన నిమిత్తమే ఉపయోగించుకునేలా వెసులబాటు కల్పించాలని ఉర్దూ మైనారిటీ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులు అదే భాషలో బోధించేలా తగిన ఉపాధ్యాయులను నియమించాలని వారు కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు పై విషయాలకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు నవంబర్ 11వ తేదీన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఉంటుందని మరియు నవంబర్ 14న మెగాఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశం జరుగుతుందని దీనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు పాల్గొంటారని తెలియచేశారు ఇకనుంచి ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం ఉంటుందని తెలియజేశారు తరువాత సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లపై చర్చిద్దామని తెలియజేసి సమావేశాన్ని ముగించారు.