రిపోర్టర్ నాని ని పరామర్శించిన ఏపీడబ్ల్యుజే ఎఫ్ నేతలు
1 min readజర్నలిస్ట్ లు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలలి
ఆర్థిక సాయం అందజేసిన ఏపీడబ్ల్యుజే ఎఫ్
నేతలు, సంఘ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రిపోర్టర్ సాధనాల మునీశ్వరరావు (నాని) ని బుధవారం ఉదయం ఏపీడబ్ల్యుజే ఎఫ్ నేతలు కండ్రిగ గూడెంలో ని నాని నివాసానికి వెళ్లి పరామర్శించారు. కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా నానికి అందజేశారు. అనునిత్యం ఒడిదుడుకులతో మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ లు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా నాని త్వరగతిన కోలుకోవాలని నేతలు సూచించారు. నానికి ఆర్థిక సాయం సుమారు పదివేలు చేసిన జర్నలిస్ట్ లను నాని, వారి కుటుంబ సభ్యులు పేరు పేరునా అభినందించారు. నానికి ఆర్థిక సాయం అందజేసిన వారిలోఏపీడబ్ల్యుజే ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.బాలసౌరి, జిల్లా అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా (జబీర్) కార్యదర్శి వైవి. హరీష్, జిల్లా ఉపాధ్యక్షులు కె. సోమ శేఖర్, యర్రా జయదాస్ (దాస్ 69) నియోజకవర్గల అధ్యక్ష, కార్యదర్శులు టి. వెంకట్రావు, ఎస్. ఋషీరావు, మరియు సభ్యులు పి. మిల్టన్ ప్రతాప్, పి.కళ్యాణ్, దొరబాబు లు ఉన్నారు.