విలువిద్య క్రీడవల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో అండర్ 19 అర్చరీ క్రీడా పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈపోటిల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈసందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ అర్చరీ క్రీడ భారతదేశంలో పుట్టిన ఇతరదేశాల్లో ప్రాచుర్యం పోందుతుందన్నారు.విద్యార్థులు చదువుల్లో రాణించాలంటే క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఏదేశంలో అయితే మహిళలకు, బాలికలకు భద్రత ఉంటుందో ఆదేశం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. బాలికలకు ఎక్కువగా రక్తహీనత ఉందని వారు ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో ఇచ్చే మందులతో పాటు మంచి ఆహారం తీసుకోవాలని కోరారు. దేహధార్యూడ్యం కోసం యోగ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో అర్చరీ కోచ్ లు నాగరత్నమయ్య, రంగా,రాజు,స్వరూప్ ,షేహానాజ్,సుప్రియ,గీత,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.