జూనియర్ లెక్చరర్లుగా టీచర్లు పనికిరారా? ప్రభుత్వానికి ఆపస్ సూటి ప్రశ్న
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను బోధించడానికి జూనియర్ లెక్చరర్లుగా ఎటువంటి బోధన అనుభవం లేని నాన్ టీచింగ్ స్టాఫ్ కు 10 శాతం ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షానఖండిస్తున్నామని, అసలు బోధనా అనుభవం లేని నాన్ టీచింగ్ స్టాఫ్, ఎన్ సి టి ఈ నార్మ్స్ ప్రకారం బి ఎడ్ అర్హత కూడా లేని కాంట్రాక్టు లెక్చరర్లు ఇంటర్ విద్యను బోధించేందుకు అవకాశం ఇస్తున్నప్పుడు, అత్యంత బోధన అనుభవం కలిగి, అత్యున్నత అర్హతలు కలిగినటువంటి టీచర్లు ఇంటర్మీడియట్ విద్యను బోధించడానికి జూనియర్ లెక్చరర్లుగా పనికిరారా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్ )రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి జీ వీ సత్యనారాయణ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో జీవో 302 ప్రకారం టీచర్లకు ఇంటర్ విద్యను బోధించేందుకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇచ్చే వారిని, అయితే కొన్ని చిన్న చిన్న కారణాలు వల్ల జీవో 223 ద్వారా అత్యంత బోధనా అనుభవం కలిగిన టీచర్లకు జూనియర్ లెక్చరర్లు గా ప్రమోషన్లు లేకుండా చేశారని, అప్పటినుంచి ఉపాధ్యాయులు జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లు ఇవ్వాలని జీవో 223 ను రద్దు చేయాలని కోరుతున్నా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని, ఇకనైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకొని అత్యంత బోధనా అనుభవం కలిగిన టీచర్లకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న హై స్కూల్ ప్లస్ లను జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా కొనసాగించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని మండలాల్లో జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలను స్థాపించాలని వారు డిమాండ్ చేశారు.