PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్యశ్రీ పథకం రద్దు  చేయడం తగదు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆరోగ్యశ్రీ పథకం రద్దు  చేయడం తగదు ఏపీసీసీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జిల్లా సహాయ కార్యదర్శి ఏం అమానుల్లా ఆవేదనఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు  ఏపీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ రద్దు చేయడం తగదు అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఖండించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రవేశపెట్టి పేదలకు ఎన్నో విధాలుగా అనేక రకమైన జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారాచూపించుకోవడం జరిగింది . ఈ పథకం ద్వారా అనేకమంది ప్రజలకు ఉపయోగకరంగా మారింది అనేకమంది ప్రాణాలు ఈ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కాపాడే ప్రయత్నం చేశారు జ అప్పటినుంచి ఇప్పటివరకు   నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది.ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా  వైద్య సౌకర్యం కల్పించాలని  కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది  లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున రిలే నిరాహార దీక్ష చేపడతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా డిమాండ్ చేశారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

About Author