చిరుత ను బంధించడానికి ఏర్పాట్లు ముమ్మరం..
1 min readసి ఎఫ్ ఏ కుమార్ నాయక్
పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రం చుట్టుపక్కల సంచరిస్తున్న చిరుతను బంధించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఏ కుమార్ నాయక్ మహానందిలో శనివారం పేర్కొన్నారు. చిరుత సంచరించిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు .దాదాపు నెల రోజుల నుంచి మహానంది క్షేత్ర గోశాల ,ఈశ్వర్ నగర్ తదితర ప్రాంతాల్లో చిరుత సంచారం ఉండటమే కాక ఒక యువకుని పై గత కొన్ని రోజుల క్రితం దాడి చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని చిరుతను బంధించడానికి ఏర్పాటు చేస్తున్నామని , భక్తులు మరియు స్థానికులు జాగ్రత్తలు పాటించాలని అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని సి సి ఎఫ్ ఏ కుమార్ నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎఫ్ఓ అనురాగ్ మీనా రేంజర్ దినేష్ కుమార్ రెడ్డి డిఆర్ఓ హైమావతి ఆలయ ఏఈవో వెంకటేశ్వర్లు అటవీ శాఖ సిబ్బంది ప్రతాప్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.