డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు..
1 min readరక్తదాన శిబిరం బైక్ ర్యాలీ కేక్ కటింగ్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు నంద్యాల జిల్లా నందికొట్కూరు జనసేన పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ (సోమవారం)ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జనసేన నాయకులు యువకులు ఏర్పాట్లు చేస్తున్నారు.పవన్ పుట్టినరోజు వేడుకలకు టిడిపి నాయకులు మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య లను ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు శ్రీరామ థియేటర్ యజమాని రామిరెడ్డి,రాము బి మధు సంపత్ రాజు ఆహ్వానించారు.ఆ రోజున పలు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరం,పట్టణంలో బైక్ ర్యాలీ, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటడం అక్కడే ముఖ్య అతిధులు మరియు నాయకుల సమక్షంలో జన్మదిన వేడుకల కేక్ కటింగ్ ఉంటుందని శ్రీరామ థియేటర్ యజమాని రామిరెడ్డి తెలిపారు.గురువారం పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ పి సుధాకర్ రెడ్డి ని మరియు ఎస్సైని వారు కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ,డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయుటకు అనుమతి కోరారు.ఈ కార్యక్రమంలో రహిమాన్, శేషన్న నాగరాజు గుడిపాడు ప్రభాకర్ ఆర్ఎంపీ రాజు బాలరాజు పాల్గొన్నారు.