ఘనంగా అర్విఎఫ్ 11వ ఆవిర్భావ వారోత్సవాలు
1 min readనూతన రాష్ట్ర అధ్యక్ష . కార్యదర్శులు గా రాయలసీమ రవీంద్ర నాథ్. బత్తిన ప్రతాప్ ఎన్నిక
పల్లెవెలుగు వెబ్ గడివేముల: రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ అర్విఎఫ్ 11వ ఆవిర్భావ వారోత్సవాలు శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. పాణ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజి ఎదుట అర్విఎఫ్ జెండాను వ్యవస్థాపక అధ్యక్షుడు రామినేని రాజు నాయుడు ఆవిష్కరించి. కేక్ కట్ చేశారు .రాయలసీమ ప్రాంత విద్యార్దులు , యువకుల సమష్యలపై , సీమ హక్కులకై , ఉపాధి , ఉద్యోగాల కోసం , ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే లక్ష్యంగా పోరు బాట సాగిస్తున్న ( రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ ) ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా RVF ఆవిర్భావ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) వ్యవస్ధాపక అధ్యక్షులు కామ్రేడ్ రామినేని రాజునాయుడు, మాట్లాడుతూ రాయలసీమ అస్ధిత్వం కోసం , ఆత్మగౌరవం కోసం , సీమ హక్కులకై , వెనుకబాటు తనంపై పోరుబాట సాగించేందుకు 2014 సంవత్సరం జూలై 13 తేదీన నంద్యాల టౌన్ నందు RVF ఆవిర్భవించిందని , ఈ 10 సంవత్సరాల కాలంలో సీమలో అనేక సమష్యలపై పోరాటం చేయడం జరిగిందని , ఎన్నో సమష్యల పరిష్కారానికై RVF నడుం బిగించిందన్నారు. రాయలసీమ జిల్లాలలో బలమైన ఉధ్యమం నడిపిన RVF. ఎనిమిది జిల్లాలలో ఎప్పటికప్పుడు విద్యార్ది , ప్రజా సమష్యలపై పోరాడుతున్నది అని అన్నారు. అనంతరం అర్విఎఫ్ నూతన కమిటీ ఎన్నిక. అర్విఎఫ్ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రామినేని రాజు నాయుడు తెలిపారు.నూతన రాష్ట్ర అధ్యక్షుడుగా రాయలసీమ రవీంద్ర నాథ్.(కర్నూలు) రాష్ట్ర కార్యదర్శిగా బత్తిన ప్రతాప్ ను (నంద్యాల) నియమించారు. 11వ వారోత్సవాల్లో భాగంగా మిగతా 5రోజులు రాయలసీమ జిల్లాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎఫ్ బి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనం వేంకటాద్రి అర్విఎఫ్ పాణ్యం డివిజన్ అధ్యక్షుడు బాలక్రిష్ణ నాయక్.మండల నాయకులు మనోహర్.పవన్.శంకర్ .వెంకట్ రాజ్ . శేఖర్. చిన్న.లు అలాగే యూత్ నాయకులు ఫకుర్.తదితరులు పాల్గొన్నారు.