PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

​నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గా పదోన్నతి

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  హెడ్ సిస్టర్ నుండి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గా పదోన్నతి పొందిన శ్రీమతి.జి.విమలమ్మకి అభినందనలు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి మంచి సేవలు అందించాలని వారికి తెలియజేశారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మంచి సేవలు అందించి అంకితభావంతో పనిచేయాలని అన్నారు .ఆసుపత్రిలో నర్సింగ్ సేవలను మరింత మెరుగపరచాలని నూతన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 పదోన్నతి  పొందిన  శ్రీమతి.జి.విమలమ్మ గకి తెలియజేశారు.ఆసుపత్రికి  వచ్చే పేషెంట్లకు మెరుగైన సేవలు చేసి ప్రజల నుంచి మన్ననలను పొందాలని వారికి సూచించారు.పదోన్నతి పొందిన సందర్భంగా ఆమె  మెరుగైన నర్సింగ్ సేవలను అందిస్తాము అని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి ARMO, డా.వెంకటరమణ, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, శ్రీమతి.S.P.సావిత్రి బాయి, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, శ్రీమతి.జి.విమలమ్మ, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్,  డా.సి.ప్రభాకర రెడ్డి,  తెలిపారు.

About Author