ఇచ్చిన మాట ప్రకారం చెరువు మరమ్మతులు .. లీకేజీ పనులు: ఎమ్మెల్యే కోట్ల
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఎన్నికల ప్రచార సమయంలో జలదుర్గం గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే గా గెలిచిన అతి తక్కువ సమయంలోనే చెరువు మరమ్మాత్థులు మరియు లీకేజీ పనుల గురించి అధికారులతో సమీక్షిస్తు పనులు ప్రారంభిస్తామని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామం నుండి పైపల్లెలకు 21 కిలోమీటర్లు దూరాన్ని కేవలం 9 కిలోమీటర్లు తగ్గించే జలదుర్గం నేరేడుచర్ల రహదారికి కావలసిన అనుమతుల గురించి అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. అనంతరం జలదుర్గం గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి నిర్వహించారు. ఈకార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వర రావు యాదవ్, మరియు ప్రభుత్వ అధికారులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.