PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా పైన అసెంబ్లీ అభ్యర్థుల పైన ఆరోపణలు చేయటం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం

1 min read

కావూరి లావణ్య మాట్లాడిన మాటలు అవాస్తవాలు, ఏపిసిసి కి ఫిర్యాదు చేస్తాం

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు

అభ్యర్థులతో ఆమె ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదు,ఫోన్ చేస్తే పిఏ మాట్లాడేవాడు

ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

చింతలపూడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజ

కావూరు లావణ్య అసలు మీది ఏ ఊరు

ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కోటి రూపాయలు బేరసారాలు

దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి

ఆలపాటి నరసింహామూర్తి సంచలన ఆరోపణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కావూరు లావణ్య ఎమ్మెల్యే తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులపై నిరూపించిలేని నిందారోపణలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏపిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాల ప్రకారం అందర్నీ కలుపుకొని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలలో పనిచేస్తామని మాటిచ్చామని, అయితే ఎంపీ అభ్యర్థి అయిన కావూరు లావణ్య డబ్బులు డిమాండ్ చేశారని, కోట్ల రూపాయలు అడిగినట్లు నాపైన, అసెంబ్లీ అభ్యర్థులపై ఆరోపణలు చేయడం, ఎవరూ సహకరించలేదని ఆరోపణ చేయడం  అవాస్తవమని ఖండించారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అభ్యర్థికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి ఆమె వచ్చి తనతో సహకరించలేదని చెప్పటం విడ్డూరమ న్నారు. ఈసమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య తనపై చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఆమె ఒక్కరే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు గొప్పలు చెప్పడం తగదని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులకు ఏమాత్రం సహకరించలేదని నేరుగా అభ్యర్థులతో ఎప్పుడు ఆమె మాట్లాడలేదని ఆమెతో మాట్లాడాలంటే ఆమె పిఏనే సమాధానం చెప్తారని, ఆమె ఎంపీగా గెలిచిపోయినట్లు ఆమె ఉన్నత స్థానంలో ఉన్నట్లు అందరు కిందిస్థాయిలో ఉన్నట్లు ఆమె వ్యవహార శైలి ఉండేదని దుయ్యబట్టారు ఇకనైనా ఆమె పద్ధతి మార్చుకోవాలని, ఆమె ఎమ్మెల్యే అభ్యర్థు లకు ఒక పైసా కూడా ఇవ్వకుండా ఇచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆమె ఫోటో లేకుండా కరపత్రాలు కానీ పోస్టర్లు కానీ ముద్రించలేదని ఆమె ఫోటోతో పాటు ఆమెకు  కూడా ఓటు వేయమని ప్రచారం నిర్వహించిన వాస్తవం తెలుసుకోవా లన్నారు. ఆమె చేసిన ఆరోపణల పట్ల ఆమె విజ్ఞతకే వదిలి వేస్తున్నామని హితవు పలికారు. ఆమెపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి, పిసిసి అధ్యక్షురాలికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దెందులూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ కావూరి లావణ్య అసలు మీది ఏ ఊరు అంటూ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇఇప్పించేందుకు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య కోటి రూపాయలు బేరసారాలు చేసిన మాట వాస్తవమని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని అందుకు కోటి రూపాయల నజరానాగా ఇవ్వాలని లావణ్య అడిగిన మాట వాస్తవమని  నరసింహమూర్తి తెలిపారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య మంగళవారం విలేకరుల సమా వేశంలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని నరసింహమూర్తి ఖండించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆమె ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదని పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహ రించడం సరికాదని హితవు పలికారు.  ఆమెపై జిల్లా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకుండా నాలుగు నెలల ముందు వచ్చి 30 ఏళ్ల అనుభవాన్ని ప్రశ్నించడం ఆమె విజ్ఞతకే వదిలి వేస్తున్నామని నరసింహమూర్తి విమర్శించారు. ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఆమె ఏజెంట్లను కూడా నియమించుకోలేదని, రాజకీయ అనుభవం లేక పార్టీ నాయకుల పై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు వారి ఖర్చులను వారే భరాయించుకొని ఎంపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఆమె ఎవరికి ఒక రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇఇప్పించేందుకు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య కోటి రూపాయలు బేరసారాలు చేసిన మాట వాస్తవమని దెందులూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని అందుకు కోటి రూపాయల నజరానాగా ఇవ్వాలని లావణ్య అడిగిన మాట వాస్తవమని  నరసింహమూర్తి తెలిపారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య మంగళవారం విలేకరుల సమా వేశంలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని నరసింహమూర్తి ఖండించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆమె ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదని పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహ రించడం సరికాదని హితవు పలికారు.  ఆమెపై జిల్లా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకుండా నాలుగు నెలల ముందు వచ్చి 30 ఏళ్ల అనుభవాన్ని ప్రశ్నించడం ఆమె విజ్ఞతకే వదిలి వేస్తున్నామని నరసింహమూర్తి విమర్శించారు. ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఆమె ఏజెంట్లను కూడా నియమించుకోలేదని, రాజకీయ అనుభవం లేక పార్టీ నాయకుల పై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు వారి ఖర్చులను వారే భరాయించుకొని ఎంపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఆమె ఎవరికి ఒక రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ఈకార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి హరికుమార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఫోక్స్ పర్సన్ బురదగుంట క్రాంతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author