30% సబ్సిడీతో కంది విత్తనాలు రైతు భరోసా కేంద్రాలలో లభ్యం..
1 min readవ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: కంది ఎల్ ఆర్ జీ 51 & ఎల్ ఆర్ జీ-105 రకాల విత్తనాలు 30 శాతం సబ్సిడీతో ఆర్.బి కేల యందు అందుబాటులో ఉన్నాయి.ఒక కేజీ ధర 140 రూపాయలు.సబ్సిడీ 42 రూపాయలు .రైతు కట్టవలసినది 98 రూపాయలు. పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకొని ఆర్ బి కే సిబ్బందిని సంప్రదించి వేలిముద్ర వేసి ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం నాడు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు.