శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం
1 min readశ్రీ గాయత్రీ దేవి అలంకరణశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో
శ్రీ వీరవిహారిణిదేవిఆలంకారం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో 5వరోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు గణపతి పూజ పూల అలంకరణ కుంకుమార్చన పూజారులచే నిర్వహించారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు అలంకరణ పూర్తి తర్వాత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అనుమతిచ్చారు. అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయగా భక్తులు తండోపతండాలుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు ఉభయ దారులు ప్రసాదాలను తమ ఇండ్ల వద్ద నుంచి భాజా భజంద్రిలతో ఆలయం వరకు తీసుకువచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారిని దర్శించుకునే భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.మద్యహం1.50 అమ్మవారికి తోటోత్సవమునీర్వహించారు.సాయంత్రం అరగంట నుంచి అమ్మవారు శ్రీ వనవిహరిణిదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయగా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 5వ రోజు రెండు ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారునిదర్శనంచెసుకున్నరు.ఎక్కువ సంఖ్యలో మహిళలు దర్శించుకున్నారు.