PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులకు అండగా ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ : డా. మన్సూర్ బాషా

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గం లో క్రీడల పరంగా ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ కి మంచి గుర్తింపు ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్.మన్సూర్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ కార్యాలయాన్ని స్పోర్ట్స్ క్లబ్  అధ్యక్షులు రేడియం నూర్ ఆహ్వానం మేరకు సందర్శించారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ వారు మహిళల కోసం నిర్వహిస్తున్న కుట్టుమిషన్ కేంద్రాన్ని పరిశీలించారు. మహిళల కోసం ఉచితంగా కుట్టుమిషన్, బుట్టల అల్లికలు, ఉలన్ వర్క్ ఉచితంగా నేర్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం గర్వించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో తమవంతు సహాయసహకారాలు ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ వారికి ఉంటాయని తెలిపారు. బీద క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి వారికి జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో అవకాశం కల్పించడం ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ కే సాధ్యమన్నారు. మంచి కార్యక్రమాలు చెయ్యడం వల్ల సమాజం లో మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ పస్పిల్ మున్నా,కోశాధికారి నాగూర్ ఖాన్, మోమిన్.హుస్సేన్ సాహెబ్ అంజుమన్ ఏ ఖబ్రస్తాన్ కమిటీ చైర్మన్ మోమిన్.ఇబ్రహీం ఖలీలుల్లా,మోటార్.షఫీవుల్లా, బైరాపురం రహామ్ పాల్గొన్నారు.

About Author