దళిత యువకుల పై మారణాయుదాలతో దాడి
1 min readకలక్టరేట్ వద్ద బాధితులతోఎమ్మార్పీఎస్ నాయుకుల ఆందోళన
అక్రమ కేసులు బనాయించారంటూ ఆవేదన
పోలీసులు,అధికారులు న్యాయం చేయాలంటూ నిరసనలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరుపెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో కొంత మంది వ్యక్తులు దళిత మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్య తోపాటు కొంత మంది దళిత యువకుల పై మారణాయుదాలతో జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ నాయుకుల ఆద్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కవ్వగుంట గ్రామంలో దళితులపై దాడి చేసి తిరిగి దళితుల పైనే కొంత మందిని కిడ్నాప్ చేసి హత్యాయ త్నానికి పాల్పడ్డారని, దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించారని ఎమ్మా ర్పీఎస్ నేతలు ఆరోపించారు. పెదవేగి పోలీసులు దళితులపై దాడి చేసిన వారిని వదిలి, దళితేతరుల దాడిలో గాయపడ్డ దళితులపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని దళిత సంఘాల నాయకులు ముళ్ళపూడి సుమన్ మాదిగ, బయ్యారపు రాజేశ్వరరావుమాదిగ, ఎంఆర్పిఎస్ నాయకులు కాశీ కృష్ణ మాదిగ, ఐనపర్టీ మాధవరావు మాదిగ, మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్య తదితరులు దళితులపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టకుండా, దాడులలో గాయపడ్డ దళితులపై కిడ్నాప్ కేసులు, హత్యాయత్నం కేసులు నమోదు చేయం పట్ల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.