ప్రభుత్వ ఉద్యోగులపై దాడి హేయమైనచర్య
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం హేయమైనచర్య అని ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించాలని చెన్నూర్ ఎంపీడీవో బి. కిరణ్ కుమార్రావు అన్నారు. చెన్నూరు ఎంపీడీవో కార్యాలయం లో ఆయన శనివారం మాట్లాడుతూ గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నేతలు ఆటవికంగా దాడి చేసి గాయపరచడం హేయమైన చర్యని ఉద్యోగులందరూ ఈ విధమైన చర్యలను ఖండిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో నమ్మకంతో ఎక్కడి నుంచి వచ్చి ప్రభుత్వ విధులు నిర్వహిస్తుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులే వారిపై దాడి చేయడం విచారకరమన్నారు. ఈ విధమైన చర్యలతో ఉద్యోగులకు ప్రజాప్రతినిధులపై నమ్మకం సన్నగిల్లుతుందని ప్రభుత్వం తగువిధంగా స్పందించి ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .రక్షించాల్సినవారే భక్షించే విధంగా దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదన్నారు. దాడి చేసిన వారిపైకేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అన్నారు. అలాగే దాడికి గురైన బాధిత ఎంపీడీవోజవహర్ బాబుకు సానుభూతిని తెలియజేశారు.