నాటు సారా స్థావరాల పై దాడులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ కర్నూలు పి శ్రీదేవి వారి ఆదేశాల మేరకు మరియు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు శ్రీ సుధీర్ బాబు ఆదేశముల మేరకు ఈరోజు కర్నూలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న నాటు సారా స్థావరాలు పై దాడులు నిర్వహించే ఉద్దేశంతో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మరియు సిబ్బంది సిబ్బందితోపాటు ఈఎస్టిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ మరియు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించగా కొల్లంపల్లి తండా రహదారిలో ఒక ఆటో ఇద్దరు మనుషులు నాటు సారా తరలిస్తూ ఉండగా పట్టు పడడం జరిగినది వెంటనే సిబ్బంది అప్రమత్తతతో సదరు ఆటోను ఆపి సుమారు 200 లీటర్ల నాటుసారా పట్టు పడడం జరిగినది తదుపరి నాటు సారా ఎక్కడి నుంచి అనే విచారించగా కొల్లంపల్లి తండాకు చెందిన తెలుగు రామదాసుగా గుర్తించడమైనది ప్రస్తుతం మొదటి వ్యక్తి రామకృష్ణ తండ్రి వెంకటేశ్వర్లు ఉలిందకొండ రెండవ వ్యక్తి వడ్డే రామకృష్ణ తండ్రి చిన్నతిరుపమన్న కొల్లంపల్లి తండా కల్లూరు మండలం గా తెలిపాడు తదుపరి ఇద్దరి వ్యక్తులతో పాటు ఒక ఆటోను 200 లీటర్ల నాటు సారాను సీజ్ చేయడం జరిగినది తెలుగు రామదాసును త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మరియు ఎస్సై రెహనా మరియు సిబ్బందితోపాటు రాజేంద్రప్రసాద్ ఇ ఎస్ టి ఎఫ్ సి ఐ, తేజ ఎస్సై మరియు సిబ్బంది సాయిబాబా పాల్గొన్నారు.