నాటు సారా పై దాడులు …2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కర్నూలు వారి ఆదేశముల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కర్నూలు పరిధిలో రెండు వేరువేరు చోట్ల నాటు సారా పై దాడులు నిర్వహించడం జరిగినది మొదటగా ఓర్వకల్లు మండలం గుమితం తండా గ్రామంలో నాటు సారా పై దాడులు నిర్వహించాము అక్కడ సుమారు 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగినది. తదుపరి గుమితం తాండా గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.నాటు సారా గురించి వాటి వలన వచ్చు అనర్థాల గురించి వివరించి నాటుసారాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున మనము పూర్తిగా నాటు సారాను నిర్మూలించవలనని తెలుపడమైనది తదుపరి ఎరకత్వ తాండ సమీపంలో ఒక బట్టి వద్ద ఆటో తో పాటు నాటు సారాను సీజ్ చేయడం జరిగినది సదరు ఆటోలో 225 కేజీల బెల్లము మరియు 45 లీటర్ల నాటు సారాయిని పట్టుకోవడం జరిగినది వీరిలో షేక్ అహ్మద్ కవాడి స్ట్రీట్ కర్నూలు మరియు శివనాయక్ కొల్లంపల్లి తండా,రాజశేఖర్, కర్నూలు టౌను బెల్లం వ్యాపారి వీరిని అరెస్టు చేయడం జరిగినది శివనాయక్ ను అరెస్ట్ చేయవలసి ఉంది. ఈ దాడుల్లో ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ఎస్సై నవీన్ మరియు సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై మధుసూదన్ మరియు సిబ్బంది ఈ ఎస్ టి ఎఫ్ ఎస్సై ఇంద్ర కిరణ్ తేజ మరియు సిబ్బంది పాల్గొన్నారు.