బంగారుపేటలో నాటుసారా స్థావరాల పైన దాడులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, కర్నూలు ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.చంద్రహాస్ , సిబ్బంది కలిసి కర్నూలు టౌన్ బంగారుపేట నందు నాటుసారా స్థావరాల పైన దాడులు జరిపి, బంగారుపేటకు చెందిన నీలి షికారి శాంతమ్మ వద్ద 10 లీటర్ల నాటుసారాని స్వాదీనము చేసుకొని సదరు వ్యక్తి ని అదుపులోకి తెసుకొని కేసును నమోదు చేయడమైనది. తదుపరి కల్లూర్ ఎస్టేట్ నందు వెంకట చలపతి నగర్ కు చెందిన బోయ రమణమ్మ వద్ధ 24 తెలంగాణ మద్యం సీసాలను (NDPL) స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడమైనది.ఈ దాడులలో కర్నూల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కే.చంద్రహాస్, Sub-Inspectors c.రెహన బేగం, K.నవీన్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.