స్వచ్ఛ గ్రామాలకు మంగళం.. చెత్త సంపద కేంద్రాలకు గొళ్ళెం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గ్రామాలలో సేకరించిన చెత్త తడి పొడి చెత్త రూపంలో వేరు చేసి సేంద్రియ ఎరువు తయారుచేసి రైతులకు అందజేయాలని ఉద్దేశంతో ఏర్పాటుచేసిన చెత్త సంపద కేంద్రాలు అక్రమార్కులకు మందు బాబులకు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి 2014 టిడిపి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాధనం దుర్వినియోగం కావడం ఊరికి దూరంగా శిధిలమైపోయాయి సేకరించిన చెత్తాచెదారాన్ని ఊరి శివారులలో కాల్చి వేస్తూ ఉండడం పర్యావరణానికి పెనుముప్పుగా మారిపోయింది ఇప్పటికైనా అధికారులు వీటిని మళ్లీ ఉపయోగంలోకి తీసుకొని రావాలని తడి పొడి చెత్త వేరు చేసి సేంద్రీయ ఎరువు ఉత్పత్తి చేసి రైతులకు అందించాలని కొడుతున్నారు.