భారత యోగ సంఘం కార్యవర్గ సభ్యులుగా అవినాష్ శెట్టి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 24వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా లో జరిగిన యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలలో కర్నూలు జిల్లా యోగ సంఘం,యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏం. అవినాష్ శెట్టి కార్యవర్గ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్వకేట్ అమిత్ మెహతా ప్రకటించారని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నూతన కార్యవర్గం 2025 నుంచి 2029 వరకు కొనసాగుతుందని లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా అవినాష్ శెట్టి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వివిధ రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులు తనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో యోగ అభివృద్ధికి నిరంతరం కృషి చేసి యువ క్రీడాకారుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.అవినాష్ శెట్టి ఎంపిక పట్ల రాష్ట్ర యోగ సంఘం అధ్యక్షులు చెరుకువాడ నరసింహారాజు, కార్యనిర్వాహక అధ్యక్షుడు సిహెచ్ ఆర్.కే వర్మ తో పాటు కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కే.ఈ జగదీష్ కుమార్,శ్రీనివాసులు, జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు విజయకుమార్,సునీల్ కుమార్, డాక్టర్ రుద్ర రెడ్డి,ఈశ్వర్ నాయుడు,వ్యాయామ ఉపాధ్యాయులు,యోగా గురువులు హర్షం వ్యక్తం చేశారు.