PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాంటీ ర్యాగింగ్ పై కర్నూలు మెడికల్ కాలేజీ లో అవగాహన సదస్సు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గారు, జిల్లా  సూపరింటెండెంట్ ఒఫ్ పోలీసు  బిందు మదవ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కు సంబందించిన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ యస్. మనోహరు, ప్రభాకర్  రెడ్డి, సూపరింటెండెంట్, కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కే.చిట్టి నరసమ్మ, ప్రిన్సిపల్, మెడికల్ కాలేజీ ఈ రోజు అనగా 19.10.2024 న కర్నూలు మెడికల్ కాలేజీ నందు అవగాహన నిర్వహించి ఈ కార్యక్రమంలో యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.  ర్యాగింగ్ యొక్క దుష్ప్రభావాల గురించి, విద్యా సంస్థలలో ర్యాగింగ్ నిషేధానికి సంబంధించిన శిక్షాపరమైన నిబంధనలు మరియు ర్యాగింగ్ కు పాల్పడిన వ్యక్తుల పై భారతీయ శిక్షాస్మృతి లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం వారికి జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి. నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్ష పరిమాణం మారుతుంది అని తెలియజేశారు.ర్యాగింగ్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన నిర్వహించడం మరియు ర్యాగింగ్‌లో పాల్గొనడంపై శిక్షాస్పద నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు ర్యాగింగులో పాల్గొన్న అందుకు ప్రోత్సహించిన వారికి శిక్ష విధించబడును, దీని వల్ల విద్యార్థులకు భవిష్యత్ లో సమస్యలు ఏర్పడును. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author