“మధ్యవర్తిత్వం” పై అవగాహన సదస్సు…
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి”శ్రీ జి.కబర్ధి” ఆదేశాల మేరకు జిల్లాన్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో “మధ్యవర్తిత్వం” పై అవగాహన కార్యక్రమంలో (Sensitization programme on Mediation) భాగంగా శనివారం పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణం లోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ అడిషనల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) “శ్రీమతి ఎస్. జ్యోతి” పాల్గొని కక్షిదారులకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ బారా అసోసియేషన్ అధ్యక్షులు బి.రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు కారప్ప, సురేష్ కుమార్, ఎల్లారెడ్డి, హల్తెన్న, మై రాముడు, నాగేష్, ఈరన్న, శ్రీనివాసరెడ్డి, నాగభూషణ్ రెడ్డి, నారాయణస్వామి, కృష్ణయ్య, సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.