రీ సర్వే పై అవగాహన సదస్సు…
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: రీ సర్వేపై అవగాహన సదస్సును మండలంలోని తమ్మడపల్లె గ్రామంలో తహసిల్దార్ రమాదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. తమ వ్యవసాయ భూములను రీ సర్వేలో సరిదిద్దుకోవాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే రీ సర్వేలో పరిష్కరిస్తామన్నారు. రైతులందరూ సంయుక్తంగా రీ సర్వే జరిగే కార్యక్రమంలో పాలుపంచుకొని సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కామేశ్వర్ రెడ్డి ఆర్ ఐ సుబ్బారావు, మాజీ సర్పంచ్ టిడిపి నాయకుడు జనార్దన్ రెడ్డి, వీఆర్వో తో పాటు పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు.