PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డయేరియా నివారణ చర్యలపై అవగాహన 

1 min read

ఐసిడిఎస్ సూపర్వైజర్   విజయలక్ష్మి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  డయోరియా నివారణ చర్యల పై ప్రజలకు మండల కేంద్రమైన గడివేముల అంగన్వాడి సెంటర్ నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలోఅవగాహన కల్పించారు. శుక్రవారం నాడు డ్రై డే సందర్భంగా గడివేముల అంగన్వాడి సెంటర్లలో అంగన్వాడి టీచర్లతో ఆయాలతో  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ మాట్లాడుతూ. గ్రామాలలో డయూరియా వ్యాధి ప్రబలుతున్నందున ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని,  నీళ్లు వేడి చేసి చల్లార్చి తాగాలని ,ఆహార పదార్థాలు వేడివేడివి మాత్రమే తీసుకోవాలన్నారు అన్నం తినే ముందు చేతులు శుభ్రంగా కడుకోవాలని, వాంతులు విరోచనాలు అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంప్రదించాలని అన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతీ శుక్రవారం అందరూ డ్రై డే పాటించాలని అన్నారు.ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని రెండు రోజులకొకసారి మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్‌ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో వుంచకుండా చూడాలని సూచించారు., సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

About Author