పూర్వ బాల్య దశ సంరక్షణ.. విద్యపై అవగాహన…
1 min readపూర్వ ప్రాథమిక విద్య, బాల్య దశ సంరక్షణ గురించి తెలియజేస్తున్న సూపర్వైజర్ సుశీల
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : మండలంలోని వివిధ గ్రామాలలో ని అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్వ బాల్యదశ సంరక్షణ, విద్యపై పూర్వ ప్రాథమిక విద్యార్థులకు తల్లిదండ్రులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ చాగలమర్రి మండల సూపర్వైజర్ సుశీల హాజరయ్యారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి అంచనా, శారీరక ,సామాజిక, వ్యక్తిగత ,భాషాభివృద్ధి తో పాటు ప్రాథమిక విద్యలో నేర్చుకునే పద్ధతులు గురించి వివరించారు. ఈ పద్ధతుల ద్వారా పిల్లలకు మేధో వికాసం అభివృద్ధి కలుగుతుందన్నారు. చాగలమర్రి న్యూ ఎస్సీ కాలనీలోని 3 వ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్లు హసీనా, వహీదా, చంద్రకళ, మై మూన్, ఇందుమతి, రహమత్, మాకు చాన్, 11 సెంటర్ కళావతి తో పాటు గొట్లూరు, మద్దూరు, జ్ఞనాపురం, పెద్ద భోజనం చిన్న భోద నం, చక్రవర్తపల్లె చిన్న వంగలి, తిప్పనపల్లె, మూడు రాళ్లపల్లె, కదిరిపురం, పెద్ద వంగలి, రాంపల్లి, చింతలచెరువు, ముత్యాలపాడు, శెట్టి వీడు, మల్లె వేముల, గ్రామాలలో కూడా ఈసీసీ ఈ డే కార్యక్రమాలను నిర్వహించారు.