సమాచార హక్కు చట్టంపై రైతులకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: సమాచార హక్కు చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి అన్నారు. స్థానిక రైతు భరోసా కేంద్రం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులతో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే శ్రీదేవి మాట్లాడుతూ, ప్రతి కార్యాలయ ఆవరణలో సమాచార హక్కుకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సెక్షన్ 7 (1) ప్రకారం దరఖాస్తు స్వీకరించిన నాటి నుండి 30 రోజులలోపు దరఖాస్తుదారుడు ఏదైతే సమాచారం కావాలని అడిగారో వారు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని తెలియజేశారు. సెక్షన్ 8(1) ప్రకారం సమాచారం బహిర్గతం నుండి మినహాయించిన సమాచారంనుగూర్చి తెలియజేయడం జరిగింది. ఏదైతే దరఖాస్తుదారుడు సమాచారం అడిగినప్పుడు, ఆ సమాచారాన్ని అధికారులు గడువులోగా ఇవ్వకపోతే సెక్షన్ 19 (1) ప్రకారం పై స్థాయి అధికారులకు అప్పీలు చేసుకోవాలని తెలియజేశారు. తమ సమస్యలపై దరఖాస్తుదారులు తగు సమాచార నిమిత్తం ఆయా కార్యాలయాలలో దరఖాస్తు చేసుకొని గడువులోగా తగు సమాచార పొందే హక్కును పౌరులకు ప్రభుత్వం కల్పించిందని ఆమె సమాచార హక్కు చట్టం పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది .