పల్లెల్లో ‘పంటల అధిక దిగుబడి’పై అవగాహన..
1 min readపంటల అధిక దిగుబడిపై ఎంఏఓ షేక్షావలి రైతులకు అవగాహన..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డేమాను మరియు కోనేటమ్మ పల్లె గ్రామాల్లో నందికొట్కూరు మండల వ్యవసాయ శాఖ అధికారి పి.షేక్షావలి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆ గ్రామాల రైతులకు అవగాహన కల్పించారు.వడ్డేమాను,కోనేటమ్మ పల్లే గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్ద రైతుల పొలాలకు క్షేత్ర సందర్శనతో పాటు రైతుల పొలాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు అదేవిధంగా వివిధ పంటల సాగుబడి ఏ విధంగా చేస్తే పంటల అధిక దిగబడి వస్తుందనే వాటి గురించి ఎంఏఓ షేక్షావలి వివిధ గ్రామాల రైతులకు అవగాహన కల్పించారు.కోనేటమ్మ పల్లె సర్పంచ్ దామోదర్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి పొలాలను పరిశీలించిన అనంతరం రైతులు పంటలు వేసుకుని మొదలు పంట నూర్పిడి చేసేంత వరకు ఎప్పటి కప్పుడు స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తీసుకొని అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులపై దృష్టి సారించాలని అదేవిధంగా వేసిన పంటలలో పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని ఎంఏఓ రైతులకు వివరించారు.ఈ అవగాహనా కార్యక్రమాలు వారంలో ప్రతి మంగళ,బుధ వారాల్లో జరుగుతాయని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.అలాగే ప్రతి మహిళా రైతు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని అన్నారు.అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయమే లాభసాటిగా ఉంటుందని అన్నారు.కోనేటమ్మ పల్లేలో ఘన జీవామృతం తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.