మద్యం దుకాణాలపై..బ్యానర్లతో అవగాహన
1 min readనాటు సారా వ్యక్తి అరెస్ట్:ఎక్సైజ్ సీఐ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మూడు మద్యం దుకాణాలకు గీత కులాల వారు దరఖాస్తులు చేసుకునేందుకు గాను వారికి అర్థమయ్యే రీతిలో ఎక్సైజ్ స్టేషన్ వద్ద బ్యానర్ తో అవగాహన కల్పిస్తున్నారు ఎక్సైజ్ శాఖ సిబ్బంది. నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో సోమవారం మద్యం దుకాణాల గురించి నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు బ్యానర్ ను ఏర్పాటు చేశారు.తర్వాత నందికొట్కూరు పట్టణంలో ఎరుకలి పేటలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లోనాటుసారా అమ్ముతున్న పాలకొండ లక్ష్మీదేవి(38) వద్ద 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేయడం జరిగిందని అదే విధంగా ఆమెను విచారిస్తున్నామని సీఐ అన్నారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ జఫురుల్లా,హెడ్ కానిస్టేబుళ్లు,శంకర్ నాయక్, పద్మనాభం,సిబ్బంది శివన్న, సుధీర్ కుమార్,మధుప్రసాద్, సంధ్యారాణి దాడుల్లో పాల్గొన్నారు.