మానవీయ నైతికవిలువలు,బాలికాసంరక్షణ పై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెవెలుగు వెబ్ ప్యాపిలీ: మానవీయ నైతికవిలువలు,బాలికాసంరక్షణ పై అవగాహన కలిగి ఉండాలని డోన్ సివిల్ జడ్జి తంగమని అన్నారు. ఈ సందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆద్వర్యంలో మానవీయ నైతికవిలువలు,బాలికాసంరక్షణ పై అవగాహన కార్యక్రమనకు డోన్ సివిల్ జడ్జి తంగమని ముఖ్య అతిథులుగా పాల్గొని సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై సామాజిక అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. నిందితులపై కఠినమైన కేసును నమోదయితున్నాయని ఆమె పేర్కొన్నారు అలాగే యువత సెల్ ఫోన్లు విలాసమైన అలవాట్లకు అలవాటై మహిళలపై అసభ్యంగా ప్రవహిస్తున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. యువత చెడు అలవాట్లకు లోనయ్యి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకొలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం ప్యాపిలి సిఐ సుధాకర్ రెడ్డి, డోన్ లాయర్ బద్దల వెంకటేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన్ పాటి, లెక్చరర్స్ రామకృష్ణయ్య, నవీన్ ,సత్యబాబు, వెంకటరమణ, ఓబులేసు, వెంకటేశ్వర్లు, శంకరయ్య, మద్దిలేటి ,ముత్తా క్ పాల్గొన్నారు.