పరస్పర సకారంతో బాల బాలికల్లో కిషోరి వికాసం పై చైతన్యం తీసుకురావాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రస్తుత సమాజంలో బాలబాలికలలో బాల్యం నుంచి యుక్త వయసు వరకు వివిధ దశలవారీగా వచ్చే మార్పులు, సమస్యలపై అన్ని శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించి వారిని చైతన్య పరచడమే ‘కిషోరి వికాసం’ లక్ష్యమని ఎంపీడీవో బి కిరణ్ మోహన్ రావు పేర్కొన్నారు, చెన్నూరు ఎంపీడీవో సభ భవనంలో మంగళవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కిషోరి వికాసం అనే కార్యక్రమం పై గ్రామస్థాయి శిక్షకుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి మాట్లాడుతూ, వయసులో పిల్లలు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, ముఖ్యంగా బాలికలలో వచ్చే మార్పులు వాటి సమస్యలపై శిక్షణ తీసుకొని శిక్షకులు గ్రామాల స్థాయిలో చైతన్యపరచవలేనని సూచించారు. సమావేశంలో మండల విద్యా శాఖ ధికారి సునీత మాట్లాడుతూ, మహిళా సంఘాలు, అంగన్వాడి టీచర్లు, కలసి కౌమర విద్యపై సరైన అవగాహన పొంది గ్రామస్థాయిలో పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలియపరచాలన్నారు. జిల్లా అసిస్టెంట్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ మనోహర్, పారా లీగల్ వాలంటరీ దశరథ రామిరెడ్డి లు మాట్లాడుతూ, 1949 వ సంవత్సరంలో నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే గా మార్పు చేయడం 2015 నుంచి దానిని అమలు పరచడం జరుగుతుందన్నారు. అందరికీ న్యాయం అనే విషయాలపై బాటలు వేసింది రాజ్యాంగ సంస్కర్త బిఆర్ అంబేద్కర్ అని వారు తెలిపారు. తల్లిదండ్రులు సరైన సంరక్షణ లేనివారికి జీవనం ,ఆరోగ్యం, విద్య, పోషణ, వంటి జాగ్రత్తలపై స్వచ్ఛంద సంస్థలు పిల్లల సంరక్షణ ఆలయాలు కలవని వారు పేర్కొన్నారు. అలాగే చిన్న పిల్లలు తెలియని వయసులో చేసే నేరాలు, శిక్షలు, బాల్యవివాహాలు జరగకుండా ఎలా చర్యలు తీసుకోవాలి, లైంగిక వేధింపులపై ఫోక్సో చట్టం ఎలా వర్తిస్తుంది, పిల్లలపై లైంగిక దాడులు జరిపితే ఎలా కంప్లైంట్ చేయాలి, వరకట్న వేధింపులు, గృహహింస, ఆర్థిక నేరాలు, భూ తగాదాలు, మహిళలు భరణం ఎలా పొందాలి తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. సీఐ. పురుషోత్తం రాజు మాట్లాడుతూ, చిన్న పిల్లల స్థాయి నుండి తల్లిదండ్రులు ముందు జాగ్రత్త చర్యలతో వారు ఇటువంటి నేరాలకు పాల్పడకుండా చూసుకోవాలని దండన శిక్ష లతో కాకుండా బహుమతులు, పొగడ్తలతో పిల్లలను పెంపకం చేపట్టాలని తెలిపారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఏటీఎం వెంకటేష్ లు మాట్లాడుతూ, పిల్లలకు తల్లి జన్మ ఇచ్చినప్పటి నుండి యుక్త వయసు వచ్చేవరకు మెడికల్, ఐసిడిఎస్, వైద్య సిబ్బంది, డాక్రా మహిళలు ఇటు ప్రత్యక్షంగా, అటు పరోక్షంగా పిల్లలకు సహాయపడుతున్నారని వివరించారు. అలాగే ‘కిషోర్ వికాసం, గణాంకాల ప్రకారం 0-18 సంవత్సరాల వయసు వరకు పిల్లల లాగానే భావించాలని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రథమ గురువు తల్లి అని వారి ఆలనా, పాలన తల్లికి బాధ్యత ఎక్కువగా ఉంటుందని అన్నారు. యుక్త వయసులో వారిలో వచ్చే మానసిక, శారీరక మార్పులను తల్లిదండ్రులు గమనించి తగువిధంగా బాధ్యతతో సత్ప్ర వర్ధన గల పౌరులుగా తీర్చిదిద్దే వారిగా ఉండాలని వారు కోరారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్ని శాఖలు పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ తీసుకొని వారిని చైతన్య వంతులు చేయాలని సూచించారు. ఏది ఏమైనప్పటికీ ఈ వయసులో పిల్లల తల్లిదండ్రులు బాధ్యతగా చాలా జాగ్రత్తగా చర్యలు చేపడితే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఈఓ పి ఆర్ డి సురేష్ బాబు, అంగన్వాడి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.