PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాదక ద్రవ్యాలకు.. యువత దూరంగా ఉండాలి

1 min read

సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

  • నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం

కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని శ్రీహరి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సీఈవో రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో పాటు మాదకద్రవ్యాల వినియోగం వల్ల తాత్కాలిక ఉత్తేజం కలుగుతుందని, ఇంతకు మించిన ప్రయోజనం ఏమి ఉండదని వివరించారు. సమాజంలో జరుగుతున్న సగం నేరాలలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్లేనన్నారు. ఇటీవల కాలంలో మత్తు మాదక ద్రవ్యాల వినియోగం పాఠశాల స్థాయి నుంచి ప్రారంభం కావడం దురదృష్టకరమని తెలియజేశారు. వీటి వినియోగం వల్ల మనిషి తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. మత్తు,మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మనసు నియంత్రణ కోల్పోయి విచక్షణారహితంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. సమాజంలో మనసును నియంత్రణలో ఉంచుకోలేకపోతే మనిషిని మించిన మృగం మరొకరు లేరని తెలియజేశారు. ప్రపంచంలో ప్రతి ప్రాణి తన జీవన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందని, కానీ మనిషి మాత్రమే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ప్రపంచంలో 190 మిలియన్ల ప్రజలు మత్తు మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలియజేశారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు వినియోగించడానికి బానిసలుగా మారిన వారు వాటి నుండి విముక్తి పొందేందుకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు.

About Author