PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఆయుధ పూజ … కర్నూలు జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులు , సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెల్పిన … జిల్లా ఎస్పీ.దుర్గా దేవికి , పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులకు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన … జిల్లా ఎస్పీ దంపతులు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు , సిబ్బందికి  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ శుక్రవారం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్బంగా  ప్రతీ ఏటా ఆనవాయితీ గా చేపట్టే ఆయుధ పూజ ను  జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ దంపతులు  నిర్వహించారు. పోలీసు ఆయుధగారంలో పోలీసులు వినియోగించే ప్రతీ ఆయుధాన్ని అలంకరించారు. దుర్గాదేవి చిత్రపటానికి, జమ్మిచెట్టుకు,  పోలీసు వాహనాలకు పూజలు చేశారు.విజయాలకు  చిహ్నమైన ఈ  విజయదశమి  అన్ని రంగాల్లో అందరికి విజయం చేకూర్చాలని , సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి . బిందు మాధవ్ ఐపీఎస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ ఎం. మహేష్ కుమార్, కర్నూల్ డిఎస్పి జె. బాబు ప్రసాద్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు,  స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్,  ఆర్ ఐలు నారాయణ, సోమశేఖర్ నాయక్, జావేద్ , పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, ఆర్ ఎస్ ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *