PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శబరిమలకు కాలినడకన వెల్తున్న  అయ్యప్ప భక్తులకు అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు సూర్య దేవాలయంలో ఈరోజు వరంగల్ నుంచి శబరిమలకు కాలినడకన వస్తున్న  అయ్యప్ప భక్తులు సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని దేవాలయం నందు పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమము సుమారు 350 మంది అయ్యప్ప భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామికి అభిషేకము పడిపూజ అయ్యప్ప భజనలు చేసినారు తదనంతరం వచ్చిన అయ్యప్ప భక్తులందరికీ సూర్య దేవాలయంలో అన్నదానం ఏర్పాటు చేయడమైనది. ఈ పడిపూజ కార్యక్రమంలో అనేకమంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు జయ గురుదత్త.

About Author