PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీల అభ్యున్నతే కూటమి ప్రణాళికలు

1 min read

ఏటా 3 లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యం

మళ్లీ కేంద్రం నుంచి ఎన్ బిసిఎఫ్ డీ సి రుణాలు

139 కులాల వారిపై  సంపూర్ణ అధ్యయనం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తుందని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న బీసీల అభ్యున్నతి లక్ష్యంగా సమగ్ర ప్రణాళికల తయారీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రాధాన్యత  ఇస్తున్నాడని తెలిపారు. ఇప్పటికే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారని స్వయం ఉపాధి మొదలుకొని బీసీలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగించేందుకు తోడ్పాటు ఇవ్వాలని ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం కార్యచరణకు మెరుగులు దిద్దుతున్నాడని తెలిపారు. ఇందుకోసం దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సంస్థల ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించాలని ఇప్పటికే చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సర్వే ప్రక్రియ పూర్తి అయితే ప్రతి సంవత్సరం మూడు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించే వెసులుబాటు కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జనాభాలో 50 సైతానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని రంగాలలో ముందుకు దూసుకు వెళ్లేందుకు సహకరించిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించడమే కాక ఎన్ బి సి ఎఫ్ డి సి కి చెందిన రుణాలను అందకుండా నీరు కార్చి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని  చేసిందని మండిపడ్డారు. ఎన్ బి సి ఎఫ్ డి సి కింద 65% రుణం ఇస్తే, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 10% లబ్ధిదారుడు వాటాతో యూనిట్లు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఈ పథకం నుంచి సుమారు రూ.100 కోట్ల రుణముగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 38 కోట్లు చెల్లించి లబ్ధిదారుని వాటాగా రూ. 15 కోట్లు కలిపి మొత్తం రూ.153 కోట్లు రుణాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారని గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పిదాలను పునరావతం కాకుండా సబ్సిడీపై కొన్ని నిబంధనలు పెట్టాలని కూటం ప్రభుత్వం యోచిస్తోందన్నారు. యూనిట్ ప్రారంభించిన తర్వాత కొంత గడువు ఇచ్చి ఆఖరులో సబ్సిడీ ఇస్తేనే పథకం విజయవంతం అవుతుందని ఇప్పటికే పలువురు సలహాలు ఇచ్చారని, మరిందా అధ్యయనం తర్వాత నిబంధనల రూపొందించేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు గుర్రప్ప యాదవ్, కొత్తకోట శ్రీనివాసులు పాల్గొన్నారు.

About Author