ఓటమి ఎరుగని నాయకుడు బాబు జగ్జీవన్ రామ్
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన ఓటమి ఎరుగని నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు ఆయన సేవలను కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రం చాంద్వా జిల్లాలో జన్మించారని ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త భారత పార్లమెంటులో సుమారు 40 ఏళ్ళ పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారని మరియు ఉప ప్రధానిగా వ్యవహరించారని, కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి దశ నుండి గాంధీజీ అహింసా వాదానికి ఆకర్షితులై 1930 లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారని జగ్జీవన్ రామ్ అనతి కాలంలోనే తన పరిపాలనా దక్షత ప్రజల పట్ల ఎనలేని ప్రేమ నిస్వార్థ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందారని చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించారని బాబురావు అభిప్రాయపడ్డారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జగ్జీవన్ రామ్ 37 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నందలి జగ్జీవన్ రామ్ చిత్రపటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఐదు రోడ్ల కూడలి నందలి జగ్జీవన్ రామ్కాంస్య విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ, డిసిసి గౌరవ అధ్యక్షులు ఉండవెల్లి వెంకటన్న, డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగ, డిసిసి ఉపాధ్యక్షులు రియాజుద్దీన్, డిసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఈ లాజరస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజ హుస్సేన్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఎన్ సి బజారన్న, రాష్ట్ర ఓబిసి ప్రధాన కార్యదర్శి సి వెంకట్ రాముడు, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాద్రి పాషా, కాంగ్రెస్ నాయకులు కే శివానంద్, పశుపల ప్రతాపరెడ్డి, సౌల్ రాజ్, ప్రతాప్, వశీ భాష మొదలగు వారు పాల్గొన్నారు.